ఉదయమాయె హృదయమా
Udayamaaye Hrudayamaa
Lyricistఎన్ సంజయ్
UncategorizedAdded on 6/27/2018
Lyrics
ఉదయమాయె హృదయమా ప్రభు యేసుని ప్రార్ధించవే పదిలముగా నిను వదలకుండా పడక నుండి లేపెనే (2) ||ఉదయమాయె|| రాత్రి గడచిపోయెనే రవి తూర్పున తెలవారెనే రాజా రక్షకుడేసు దేవుని మహిమతో వివరించవే (2) ||ఉదయమాయె|| తొలుత పక్షులు లేచెనే తమ గూటి నుండి స్తుతించెనే తండ్రి నీవే దిక్కు మాకని ఆకాశమునకు ఎగిరెనే (2) ||ఉదయమాయె|| పరిశుద్ధుడా పావనుండా పరంధాముడా చిరంజీవుడా పగటియంతయు కాచి మము పరిపాలించుము దేవుడా (2) ||ఉదయమాయె|| తండ్రి దాతవు నీవని ధరయందు దిక్కు ఎవరని రాక వరకు కరుణ చూపి కనికరించి బ్రోవుమా (2) ||ఉదయమాయె||