ఉన్నాడు దేవుడు నాకు తోడు
Unnaadu Daevudu Naaku Thodu
Lyricistబాలరాజు
UncategorizedAdded on 6/5/2017
Lyrics
ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడడెన్నడు ఎడబాయడు కష్టాలలోన నష్టాలలోన వేదనలోన శోధనలోన ||ఉన్నాడు|| గాఢాంధకారములో సంచరించినా కన్నీటి లోయలో మునిగి తేలినా కరుణ లేని లోకము కాదన్ననూ కన్నీరు తుడుచును నను కొన్నవాడు ||ఉన్నాడు|| యెహోవ సన్నిధిలో నివసింతును చిరకాలమాయనతో సంతసింతును కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును బ్రతుకు కాలమంతయు హర్షింతును ||ఉన్నాడు||