ఉన్నపాటున వచ్చుచున్నాను
Unnapaatuna Vachchuchunnaanu
Lyricistపురుషోత్తము చౌదరి
UncategorizedAdded on 11/19/2016
Lyrics
ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను ||ఉన్న|| కారుణ్య నిధి యేసు – నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీ దరి – జేర రమ్మని పిలుచుటయు ని ష్కారణపు నీ ప్రేమ యిది మరి – వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న|| మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె దో-ష సమూహములు మచ్చలై అసిత మగు ప్రతి డాగు తుడువను – గసుటు గడిగి పవిత్ర పరపను అసువు లిడు నీ రక్తమే యని – మాసల కిప్పుడు సిలువ నిదె గని ||ఉన్న|| వెలుపట బహు యుద్ధ-ములు లోపటను భయము – కలిగె నెమ్మది దొలాగెను పలు విధములగు సందియంబుల – వలన పోరాటములచే నే నలసి యిటునటు గొట్టబడి దు-ర్బలుడనై గాయములతో నిదె ||ఉన్న|| కడు బీద వాడ నం-ధుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను సుడివడిన నా మదికి స్వస్థత – చెడిన కనులకు దృష్టి భాగ్యము బడయ వలసిన వన్ని నీ చే – బడయుటకు నా యొడ యడా యిదె ||ఉన్న|| నీ వాగ్దత్తము నమ్మి – నీపై భారము పెట్టి – జీవ మార్గము గంటిని కేవలంబగు ప్రేమ చేతను – నీవు నన్ను క్షమించి చేకొని భావ శుద్ధి నొనర్చి సంతో-షావసరముల నిడుదువని యిదె ||ఉన్న|| దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ – తరమే వర్ణన చేయను తెరవు కడ్డం బైన యన్నిటి – విరుగ గొట్టెను గాన నే నిపు డరుదుగా నీ వాడ నవుటకు – మరి నిజము నీ వాడ నవుటకే ||ఉన్న||