ఉపవాసంతో ప్రార్ధనలో
Upavaasmtho Praardhanalo
Lyricistరాజా మండ్రు
UncategorizedAdded on 1/8/2018
Lyrics
ఉపవాసంతో ప్రార్ధనలో నీ వైపే చూస్తున్నా దేవా మోకాళ్లపై కన్నీటితో నే చేయు ప్రార్ధన వినుము దేవా అడిగిననూ ఇయ్యవా దేవా వెదకిననూ దొరకవా దేవా తట్టిననూ తీయవా దేవా యేసయ్యా విను నా ప్రార్ధన ||ఉపవాసంతో|| నా నోట మాటలెల్ల నిను స్తుతించాలయ్యా నా యొక్క తలంపులన్ని నీవవ్వాలయ్య దీపముగా మారి వెలుగును ఇవ్వాలయ్యా రుచికరంగా నీ ఉప్పుగా ఉండాలయ్యా (2) ||అడిగిననూ|| జీవించు కాలమంతా నీ సేవ చేయాలి నీ యొక్క సువాసన నేనివ్వాలయ్యా నేటి యువతకు ఆదర్శంగా ఉండాలయ్యా రేపటి సంఘానికి నీ మార్గం చూపాలయ్యా (2) ||అడిగిననూ||