వాడబారని విశ్వాసముతో

Vaadabaarani Vishvaasamutho

Lyricistవాడబారని విశ్వాసముతో
UncategorizedAdded on 8/26/2016

Lyrics

శుభప్రదమైన నిరీక్షణతో
వేచియున్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా
యేసయ్యా
నీ రాక కోసమై – కడబూర శబ్దముకై
నీ మహిమ కోసమై – నిన్ను చేరుటకై
(2)        ||వాడబారని||
మోకాళ్లపై వేచితి – కన్నీళ్ల పర్యంతమై
బీడు బారిన నేల వానకై – ఎదురు చూచినా సంఘమై
సిద్ధపడియున్న వధువునై
ఆశతో వేచానయ్యా
యేసయ్యా
||నీ రాక||
లేఖనములను చూచితి – గురుతులు గమనించితి
ప్రవచన నెరవేర్పులన్ని – జరుగుట గుర్తించితి
రారాజువై నీవు రావాలని
ఎదురు చూచుచున్నానయ్యా
యేసయ్యా
||నీ రాక||
నీటి కొరకై వేచిన – గూడ బాతును పోలిన
ఆత్మ దాహము తోడనిండి – అల్లాడుచున్నానయ్యా
లోక బంధాల నుండి
నీ చెలిమి కోరానయ్యా
యేసయ్యా
||నీ రాక||

Video