వాడిపోకముందే

Vaadipokamumdae

Lyricistవాడుకో… యేసయ్యా….
UncategorizedAdded on 1/4/2019

Lyrics

పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా
నీ కాడి నే మోస్తానయ్యా –
వాడిపోకముందే నన్ను వాడుకో
పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో
వాడుకో యేసయ్యా – నీ కాడి నే మోస్తా
(2)          ||వాడిపోక||
నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే
నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే
(2)          ||వాడుకో||
నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే
నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే
(2)          ||వాడుకో||
నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే
నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే
(2)          ||వాడుకో||
నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే
నాకున్న అవకాశం చేజారి పోకముందే
(2)          ||వాడుకో||

Video