వాటి వాటి కాలమున
Vaati Vaati Kaalamuna
UncategorizedAdded on 1/5/2023
Lyrics
ఎస్ జే బెర్క్మన్స్ వాటి వాటి కాలమున అన్నిటిని అతి మనోహరముగా చేయువాడా యేసయ్యా.. యేసయ్యా.. నా దైవం నీవేనయ్యా (2) ||వాటి వాటి|| ఆశ భంగం కానేరదు మంచి రోజు ముందున్నది సత్క్రియను ఆరంభించెను ఎటులైన చేసి ముగించును (నే) రూఢిగా నమ్ముచున్నాను ఎటులైన చేసి ముగించును (2) ||యేసయ్యా|| అద్భుతములు చేసెదను నీ తోడుంటానంటివి నా ప్రజల ఎదుట నీవు (నను) హెచ్చింప చేసెదవు (నే) రూఢిగా నమ్ముచున్నాను హెచ్చింప చేసెదవు (2) ||యేసయ్యా|| ఇప్పుడున్న వాటి కంటే వెయ్యి రెట్లు చేసెదవు ఆకాశ తార వలె భువిలో ప్రకాశింతును (నే) రూఢిగా నమ్ముచున్నాను భువిలో ప్రకాశింతును (2) ||యేసయ్యా||