వచ్చింది వచ్చింది వచ్చింది
Vachchimdi Vachchimdi Vachchimdi
UncategorizedAdded on 12/15/2021
Lyrics
మార్పులేకుండ చేస్తే శుద్ద దండగా వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ యేసయ్య కోరింది మనలో మార్పునే కదా ఇంటికి రంగులు కాదు – వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు – త్రాగుబోతు విందులు కాదు మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్ ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ ||వచ్చింది|| రంగురంగు వస్త్రాలు – మురికిగుడ్డల మనస్సులు మెరిసిపోతున్న ఇళ్ళు – మాసిపోయాయి హృదయాలు ఇంటిపైన నక్షత్రాలు – ఇంటిలో మద్యపానులు పేరుకేమో క్రైస్తవులు – తీరుమారని జనులు (2) ||ఇంటికి|| విద్యలేని పామరులు – విధేయులై బ్రతికారు విద్యవున్న సోమరులు – మందిరాలకే రారు తూర్పుదేశపు జ్ఞానులే – మోకాళ్ళు వంచినారు చదువు పదవుంటే చాలు – మోకరించరు వీరు (2) ||ఇంటికి|| దినములు చెడ్డవి గనుక – సమయమును పోనియ్యక అజ్ఞానులవలె కాక – జ్ఞానులవలె నడవాలి పాపము తీయుట కొరకే – ప్రభు పుట్టాడని తెలిసి పాపము వీడక నీవు – ఉత్సవ ఉల్లాసాలా (2) ||ఇంటికి||