వర్ష ధారగా రావా
Varsha Dhaaragaa Raavaa
UncategorizedAdded on 10/18/2016
Lyrics
ఎండిపోయిన భూమి నేనయ్యా ఈ నేలలో పంట లేదయ్యా నా మనస్సులో శాంతి లేదయ్యా వర్ష ధారగా రావా నా యేసయ్యా ఫలింపజేయుమా పరమేశ్వరా పాపములన్ని పరిహరించుమా భయములెల్ల పారద్రోలుమా యేసు నాథుడా నా రక్షకా నీదు కృపతో ఆదరించుమా మనో వ్యధలను గుణ పరచుమా తనువు గాయమెల్ల స్వస్థపరచుమా యేసు నాథుడా పరమ వైద్యుడా గాయములెల్ల స్వస్థపరచుమా