వీనులకు విందులు చేసే

Veenulaku Vimdulu Chaesae

UncategorizedAdded on 8/9/2017

Lyrics

వేగిరమే వినుటకు రారండి
ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి
||వీనులకు||
రండి… విన రారండి
యేసయ్య ఎవరో తెలిసికొన రారండి
నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి
రండి…
||వీనులకు||
రండి… వచ్చి చూడండి
యేసయ్య చేసే కార్యములు చూడండి
నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి
రండి…
||వీనులకు||
సృష్టి కర్తను మరచావు నీవు
సృష్టిని నీవు పూజింప దగునా
భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి
రండి…
||వీనులకు||

Video