విడిపిస్తాడు నా యేసుడు
Vidipisthaadu Naa Yaesudu
UncategorizedAdded on 9/11/2020
Lyrics
విడిపిస్తాడు నా యేసుడు మరణపు లోయైనా నను విడువడూ మనసు ఓడిపోయిననూ మనువు వాడిపోయిననూ నను ఎత్తుకొనీ… నను ఎత్తుకొనీ కాలికి ధూలైన తగలక ||విడిపిస్తాడు|| ఆశలన్నీ క్షణికములో ఆవిరియై పోయినా కంటిమీద కునుకేమో కన్నీళ్ళై పారినా తన కౌగిటిలో… తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి ||విడిపిస్తాడు|| ఎండమావులే స్నేహితులై ఓదర్పే కరువైనా బండరాల్లే భాగ్యములై బ్రతుకు భారమైననూ తన కౌగిటిలో… తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి ||విడిపిస్తాడు|| కలలు అన్ని కల్లలై కలతలతో నిండిననూ గాలి మేడలే ఆస్తులై శూన్యములే మిగిలిననూ తన కౌగిటిలో… తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి ||విడిపిస్తాడూ||