విడువదు మరువదు
Viduvadu Maruvadu
UncategorizedAdded on 8/30/2017
Lyrics
విడువదు మరువదు – ఎన్నడూ ఎడబాయదు ఎనలేని ప్రేమ – విలువైన ప్రేమ మితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువదు|| నా స్థితి ఏదైనా – చింత ఏదైనా బాధ ఏదైనా – నను విడువదు లోకమే నను చుట్టినా – ఆశలే నను ముట్టినా యేసయ్య సాన్నిధ్యం – నను విడువదు మా నాన్న నా చేయి విడువడు ప్రాణంలా ప్రేమించే నా దేవుడు విడువడు మరువడు – విడువడు మరువడు విడువడు మరువడు – ఎన్నడూ ఎడబాయడు నన్ను ఎత్తుకున్న – నన్ను హత్తుకున్న నా తండ్రి కౌగిలి – నే విడువను శోకమే కృంగించినా – దుఃఖమే బాధించినా నా ప్రియుని చిరునవ్వు – నే మరువను నన్నెంతో ప్రేమించిన రాజును ఎడబాసి మనలేనే రోజును విడువను మరువను – విడువను మరువను విడువను మరువను – ఎన్నడూ ఎడబాయను ఎనలేని ప్రేమ విలువైన ప్రేమ మితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువను||