విడువవు నన్నిక

Viduvavu Nannika

UncategorizedAdded on 1/5/2018

Lyrics

విడువవు నన్నిక ఎన్నడైననూ
పడిపోకుండా కాయు రక్షకా
పడిపోవు వారెల్లరిని
లేపెడి వాడవు నీవే ప్రభు
(2)     ||విడువవు||
ప్రభువా నీకవిధేయుడనై
పలు మారులు పడు సమయములలో
ప్రేమతో జాలి దీన స్వరముతో
ప్రియుడా నను పైకెత్తితివి
(2)     ||విడువవు||
ఆదాము హవ్వలు ఏదెనులో
ఆశతో ఆజ్ఞ మీరినను
సిలువకు చాయగా బలినర్పించి
ప్రియముగా విమోచించితివి
(2)     ||విడువవు||
మా శక్తియు మా భక్తియు కాదు
ఇలలో జీవించుట ప్రభువా
కొల్లగా నీ ఆత్మను నొసగితివి
హల్లెలూయా పాడెదను
(2)     ||విడువవు||

Video