విజయశీలుడా

Vijayasheeludaa

UncategorizedAdded on 6/21/2017

Lyrics

కృతజ్ఞతతో నిను స్తుతించెదను
నా యేసయ్యా నిను వేడుకొనగా
నా కార్యములన్నియు సఫలము చేసితివి
(2)          ||విజయశీలుడా||
అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు –
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు
నిత్యానందము కలిగించె నీ
శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి
(2)          ||విజయశీలుడా||
ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు
అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు
నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి
వాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా
(2)          ||విజయశీలుడా||
ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు –
అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు
నిత్యము నీతో నేనుండుటకై
నూతన యెరూషలేము నిర్మించుచున్నావు
(2)          ||విజయశీలుడా||

Video