విలువైన నీ కృప
Viluvaina Nee Krupa
UncategorizedAdded on 12/30/2017
Lyrics
ఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరం దినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నో ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో నా జీవిత కాలమంతా నను నడుపుము యేసయ్యా నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్యా (2) ||విలువైన|| గడచినా కాలమంతా తోడైయున్నావు అద్భుతాలు ఎన్నో చేసి చూపావు లెక్కించ లేని మేలులతో తృప్తి పరిచావు నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు (2) ||నా జీవిత|| సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా నూతన కార్యాలు ఎన్నో చేశావు సంవత్సరమను నీ దయా కిరీటం ధరింప చేశావు నా దినములు పొడిగించి నీ కృపలో దాచావు మా దినములు పొడిగించి నీ కృపలో దాచావు ||నా జీవిత||