విన్నారా విన్నారా

Vinnaaraa Vinnaaraa

UncategorizedAdded on 12/14/2017

Lyrics

మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను
వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను
తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను
ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం
యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం
(2)      ||విన్నారా||
దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడని
గొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా
పరలోక దూతల సమూహముతో – స్తోత్రగీతాలు పాడిరంటా
లోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా
||ఊరు వాడా||
ఆ….తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడని
జ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా
బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చి వచ్చిరంటా
రాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్లిరంటా
||ఊరు వాడా||

Video