వివాహమన్నది
Vivaahamannadi
Lyricistవివాహమన్నది పవిత్రమైనది
UncategorizedAdded on 3/27/2017
Lyrics
ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2) ||వివాహమన్నది|| ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2) ||వివాహమన్నది|| దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2) ||వివాహమన్నది||