వందనము నీకే నా

Vmdanamu Neekae Naa

UncategorizedAdded on 6/12/2018

Lyrics

వర్ణనకందని నీకే నా వందనము
(2)      ||వందనము||
నీ ప్రేమ నేనేల మరతు
నీ ప్రేమ వర్ణింతునా
దాని లోతు ఎత్తునే గ్రహించి
నీ ప్రాణ త్యాగమునే తలంచి
(2)      ||వందనము||
సర్వ కృపానిధి నీవే
సర్వాధిపతియును నీవే
సంఘానికి శిరస్సు నీవే
నా సంగీత సాహిత్యము నీవే
(2)      ||వందనము||
పరిశుద్ధమైన నీ నామం
పరిమళ తైలము వలె
పరము నుండి పోయబడి
పరవశించి నేను పాడెదను
(2)      ||వందనము||
మృతి వచ్చెనే ఒకని నుండి
కృప వచ్చెనే నీలో నుండి
కృషి లేక నీ కృప రక్షించెను
కృతజ్ఞతార్పణలర్పింతును
(2)      ||వందనము||
తండ్రియైన దేవునికే
కుమారుడైన దేవునికే
పరిశుద్ధాత్మ దేవునికే
వందన వందన వందనము
(2)      ||వందనము||

Video