యాకోబు బావి కాడ
Yaakobu Baavi Kaada
UncategorizedAdded on 10/2/2017
Lyrics
ఎండా వేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా నేనిచ్చుఁ నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే (2) ||యాకోబు|| అయ్యా నే సమరయ స్త్రీని – మీరేమో యూదులాయె మీకు మాకు ఏనాడైనా – సాంగత్యము లేకపాయె నేనిచ్చుఁ నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా చేదుటకు ఏమి లేదు నాకెట్లు ఇస్తావయ్యా (2) ||యాకోబు|| అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానే నీళ్లు నీకు ఇస్తాగాని నీ భర్తను రమ్మన్నాడే అయ్యా నే ఒంటరిదాన్ని నాకెవ్వరు లేరన్నానే లొపేమి ఎరగనట్టు లోగుట్టు దాచినానే (2) ||యాకోబు|| నీకు భర్త లేడన్నాడే పెనిమిట్లు ఐదుగురుండే ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదన్నాడే వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా (2) ||యాకోబు|| నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు ఏ తట్టు చూస్తున్నావో లోగుట్టు దాస్తున్నావో గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా తప్పకుండ యేసు ముందు తల వంచి మొక్కాలమ్మా (2) ||యాకోబు||