యావే

Yaavae

Lyricistసామ్ పడింజరెకర
UncategorizedAdded on 3/12/2023

Lyrics

అనువదించినది:
ఫాన్ని జాయ్ మోసెస్
భయము లేదు దిగులే లేదు
నా జీవితమంతా ప్రభు చేతిలో
నిరాశ నన్నెన్నడు ముట్టలేదు
నిరీక్షణతో అనుదినం సాగెదను
యావే నీవే నా దైవం – తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకు
నీవు కునుకవు నీవు నిదురపోవు
ఇశ్రాయేలున్ కాపాడువాడ(వు)
మరణ భయం అంతా పోయెను
శత్రు భీతి అంతా తొలగించెను
మరణమును ఓడించి
శత్రువును జయించిన
సర్వాధికారివి నా దేవా
ఓటమిని అంతా తీసివేసి
రోగాన్ని అంతా మాన్పివేసి
జయశీలుడవు
పరమ వైద్యుడవు
సర్వశక్తుడవు నా రక్షకా

Video