యేసే గొప్ప దేవుడు
Yaesae Goppa Daevudu
UncategorizedAdded on 8/29/2016
Lyrics
యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనతా బలము కలుగును ఆమెన్ మహా శ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగ నిలచిన యోబు వలె నే జీవించెదను అద్వితీయుడు ఆదిసంభూతుడు దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము|| ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2) ||స్తోత్రము|| జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలె నే జీవించెదను అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||