యేసే నీ మదిలో ఉండగా
Yaesae Nee Madilo Umdagaa
Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 7/9/2018
Lyrics
యేసే నీ మదిలో ఉండగా కలతే దరి చేరగ రాదుగా సోదరా సోదరీ.. యేసులో నెమ్మది ఓ సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ మది ||యేసే|| తీరిపోని బాధలెన్నో నిన్ను బంధించినా ఓర్వలేని మనుజులంతా నిన్ను నిందించినా నీ చెంతకు చేరి నిలుపును నీ చింతను తీర్చి నడుపును సోదరా సోదరీ.. యేసే నీ మాదిరి సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ గురి సిలువపైన బలిగా మారి నిన్ను ప్రేమించెగా సహింపలేని శోధనలను నీకు దయచేయునా శోధనలను గెలిచే మార్గము తప్పక నీకొసగును తథ్యము సోదరా సోదరీ.. యేసులో విజయము సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నమ్మకం