యేసయ్య మాట విలువైన మాట

Yaesayya Maata Viluvaina Maata

UncategorizedAdded on 5/12/2017

Lyrics

వినిపించుకోవా సోదరా
వినిపించుకోవా సోదరీ
నీ గుండెలోన ముద్రించుకోవా
ఏ నాటికైనా గమనించలేవా
గమనించుము పాటించుము ప్రచురించుము
నిన్నూవలె నీ పొరుగువారిని
ప్రేమించమని ప్రేమించమని
||యేసయ్య||
ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులని చెప్పిన మాట
నీతివిషయమై ఆకలిగొనువారు ధన్యులని చెప్పిన మాట
కనికరము గలవారు – హృదయశుద్ది గలవారు
సమాధానపడువారు – సాత్వికులు ధన్యులని
దుఃఖపడువారు ధన్యులని చెప్పిన మాట
||యేసయ్య||
నరహంతకులు కోపపడువారు నరకాగ్నికి లోనగుదురని
అపహారకులు వ్యభిచరించువారు నరకములో పడిపోదురని
కుడిచెంప నిను కొడితే – ఎడమ చెంప చూపుమని
అప్పడుగగోరువారికి నీ ముఖము త్రిప్పకుము
నీ శత్రువులను ద్వేషించక ప్రేమించమని
||యేసయ్య||

Video