యేసయ్య నామము
Yaesayya Naamamu
LyricistRSV Raj
UncategorizedAdded on 3/28/2020
Lyrics
యేసయ్య నామము నా ప్రాణ రక్ష గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష నాశనకరమైన తెగులుకైనా భయపడను నేను భయపడను (2) ||యేసయ్య|| రోగ భయం – మరణ భయం తొలగిపోవును యేసు నామములో (2) ||యేసయ్య|| అపాయమేమియు దరికి రాదు కీడేదియు నా గదికి రాదు (2) ||యేసయ్య|| పరలోక సేన నన్ను కాయును పరలోక తండ్రి నా తోడుండును (2) ||యేసయ్య|| యేసుని నామమే స్తుతించెదము వ్యాధుల పేరులు మరిచెదము (2) ||యేసయ్య||