యేసయ్య నామంలో
Yaesayya Naammlo
UncategorizedAdded on 7/30/2017
Lyrics
శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2) ||యేసయ్య|| పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| సృష్టిని శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||