యేసయ్యా కనికరపూర్ణుడా

Yaesayyaa Kanikarapoornudaa

Lyricistయేసయ్యా కనికరపూర్ణుడా
UncategorizedAdded on 2/28/2017

Lyrics

మనోహర ప్రేమకు నిలయుడా
నీవే నా సంతోష గానము
సర్వ సంపదలకు ఆధారము
(2)          ||యేసయ్యా||
నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి
సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే
(2)          ||యేసయ్యా||
నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు
దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి
అలసిన వారి ఆశను తృప్తిపరచితివి
అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము
(2)          ||యేసయ్యా||
నీ వలన బలమునొందిన వారే ధన్యులు
నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు
నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు
నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు
(2)          ||యేసయ్యా||
ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు
ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు

Video