యేసయ్యా నా ప్రాణనాథా నిను

Yaesayyaa Naa Praananaathhaa Ninu

Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 8/1/2018

Lyrics

యేసయ్యా నా ప్రాణనాథా నిను
ఆడి పాడి కీర్తించెదను
నీవే నా జీవదాత అని
లోకమంతా చాటించెదను
||యేసయ్యా||
సర్వశక్తిమంతుడా సర్వాధికారి
సర్వలోకమును సృష్టించిన సుందరుడా
స్తుతి మహిమా ఘనతా నీకే అని
సంతసించి స్తోత్రించెదను
||యేసయ్యా||
పాపమే ఎరుగని నీతిమంతుడా
పాపిని రక్షించిన నీతిసూర్యుడా
పరిశుద్ధ పరలోక తండ్రి అని
పరవశించి నే పాడెదను
||యేసయ్యా||
ఆది అంతమైన అల్ఫా ఒమేగా
మేఘముపై రానున్న మహిమోన్నతుడా
ఉన్నవాడవు అనువాడవు నీవని
ఉల్లసించి ఆరాధింతును
||యేసయ్యా||

Video