యేసయ్యా నా యేసయ్యా
Yaesayyaa Naa Yaesayyaa
UncategorizedAdded on 10/6/2016
Lyrics
రమ్ము రమ్ము యేసునాథ వేగమె రారమ్ము ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ చూచుటకెన్నో వింతలున్నవి ఈ భువిలోన చూడగా ఎందరో ఘనులున్నారు ఈ ధరలోన ఏమి చూచిన ఎవరిని చూచిన ఫలమేమి నా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా ||రమ్ము|| నా రూపమే మారునంట నిన్ను చూచువేళ నిన్ను పోలి ఉండెదనంట నీవు వచ్చు వేళ అనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యా అందుండు సర్వ సంపదలన్నీ నా స్వంతమయ్యా ||రమ్ము|| అమూల్యమైన రత్నములతో అలంకరించబడి గొర్రెపిల్ల దీపకాంతితో ప్రకాశించుచున్న అంధకారమే లేని ఆ దివ్యనగరమందు అవధులు లేని ఆనందముతో నీతో నుండెదను ||రమ్ము||