యేసయ్యా నన్నెందుకు
Yaesayyaa Nannemduku
Lyricistజ్యోతి స్వరాజ్
UncategorizedAdded on 5/14/2020
Lyrics
యేసయ్యా.. నన్నెందుకు ఎన్నుకున్నావయ్యా తెలుపుము నీ చిత్తము నా యెడల – (2) ||యేసయ్యా|| ఏ దరి కానక తిరిగిన నన్ను నీ కౌగిటిలో చేర్చుకున్నావయ్యా ఏమి నీ ప్రేమా – ఏమి నీ కృప నా యెడల ఏమి నీ కృప నా యెడల ||యేసయ్యా|| చనిపోయిన స్థితిలో పడిపోయిన నన్ను నీ జీవము నొసగి బ్రతికించావయ్యా ఏమి నీ దాక్షిణ్యం – ఏమి నీ దయ నా యెడల ఏమి నీ దయ నా యెడల ||యేసయ్యా|| శోధనా బాధలో కృంగిన నన్ను నిరీక్షణ నొసగి బలపరచావయ్యా ఏమి నీ ఆదరణ – ఏమి నీ ఆశ నా యెడల ఏమి నీ ఆశ నా యెడల ||యేసయ్యా||