యేసయ్యా నిన్ను చూడాలని

Yaesayyaa Ninnu Choodaalani

UncategorizedAdded on 11/2/2015

Lyrics

మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు
ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా
(2)         ||యేసయ్యా||
అందరు ఉన్నారని అందరు నావారని
తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని
చివరికి ఒంటరి నేనైతిని
నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా
||యేసయ్యా||
అంధకారములో అంధుడ నేనైతిని
నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా
నాకొసగుమా నజరేయుడా
నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా
నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా
||యేసయ్యా||

Video