యేసూ ప్రభుని స్తుతించుట
Yaesoo Prabhuni Sthuthimchuta
UncategorizedAdded on 7/30/2017
Lyrics
యేసూ ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మేము చేసెను హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| మా శైలము మా కేడెము మా కోటయు మా ప్రభువే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| అతిసుందరుడు అందరిలోన అతికాంక్షనీయుడు అతి ప్రియుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| రాత్రింబవళ్లు వేనోళ్లతోను స్తుతించుటయే బహుమంచిది హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||