యేసు గొరియ పిల్లను నేను
Yaesu Goriya Pillanu Naenu
UncategorizedAdded on 11/9/2015
Lyrics
వధకు తేబడిన గొరియ పిల్లను దినదినము చనిపోవుచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) ||యేసు గొరియ|| నా తలపై ముళ్ళు గుచ్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి నా మోమున ఉమ్మి వేయబడినది నా చూపులు తల దించుకున్నవి (2) ||యేసు గొరియ|| నా చేతుల సంకెళ్ళు పడినవి నా రాతలు చెరిగిపోతున్నవి నా కాళ్ళకు మేకులు దిగబడినవి నా నడకలు రక్త సిక్తమైనవి (2) ||యేసు గొరియ||