యేసు క్రీస్తు పుట్టెను నేడు
Yaesu Kreesthu Puttenu Naedu
UncategorizedAdded on 1/2/2017
Lyrics
మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో ఇది పండుగ – క్రిస్మస్ పండుగ జగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2) ||యేసు క్రీస్తు|| పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2) ||ఇది పండుగ|| సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను (2) ||ఇది పండుగ|| శరీర ధారిగా – కృపగల దేవునిగా పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను (2) ||ఇది పండుగ||