యేసు నాథా దేవా
Yaesu Naathhaa Daevaa
UncategorizedAdded on 3/18/2021
Lyrics
యేసు నాథా దేవా వందనాలు రాజా.. వందనాలు రాజాధి రాజా నీకే వందనాలు రవి కోటి తేజా నీకే వందనాలు (2) ||యేసు నాథా|| పాపిని కరుణించి ప్రాణ దానమిచ్చావు పరమ జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి పన్నెండు గుమ్మముల… పట్టణమే నాకు కట్టిపెట్టినావా ||రాజాధి రాజా|| నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు నీ నీతి నాకిచ్చి నిత్య రాజ్యమిచ్చావు నీ నీతి నీ రాజ్యం… నిండైన నా భాగ్యమే ||రాజాధి రాజా|| హీనుని దీవించి ఘనునిగా చేసావు నీ రుధిరమే కార్చి నా ఋణము దీర్చావు నా సల్లనయ్యా… నా యన్న నీవే నా యేసయ్యా ||రాజాధి రాజా|| కన్ను మిన్ను గానకుండా నిన్ను మీరిపోయాను చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు నీ మనసే వెన్నయ్యా… నా కన్న తండ్రి నా యేసయ్యా ||రాజాధి రాజా||