యేసు నీ స్వరూపమును
Yaesu Nee Svaroopamunu
UncategorizedAdded on 1/12/2018
Lyrics
నీ పోలికగా నేను మారేదన్ యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి దాసుని రూపము ధరించి దీనుడైతివి నేను దీనుడను కాను గర్వముతో నిండియున్నాను నీదు వినయముతో నింపుము ప్రేమగల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి నీ ప్రేమ ద్వారనే సమస్తము నిచ్చితివి నీ ప్రేమ చూపలేను కఠినుడనైయున్నాను నీ ప్రేమతో నింపుము యేసు నీ స్వరూపము కలిగి ఆయన వాలే మారెదన్ నీ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్ ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము నీ పవిత్రతతో నింపుము