యేసు నీ వారము
Yaesu Nee Vaaramu
UncategorizedAdded on 4/10/2016
Lyrics
తల్లి తండ్రి గురువు దైవం – అన్నీ నీవేలే మా ప్రాణం మా గానం – మా సర్వం మా సకలం అన్నీ నీవొసగినవే మాదంతా నీకేలే – మహిమంతా నీకేలే స్తుతి స్తోత్రముల్ నీకేలే సర్వంబు నీవైన ప్రభువా హల్లెలూయ స్తుతి మహిమ నీకే ఈ భూమి ఈ గాలి – ఈ నేల ఈ నీరు అన్నీ నీవొసగినవే ఆకాశం ఆ తారల్ – ఆ ఇనుని ఆ చంద్రుని మాకోసం నిలిపితివే ఆద్యంతముల ప్రభువా ఆరాధింతుము నిన్నే సిలువలో మరణించి – మరణమునే ఓడించి జయమును పొందితివే పాపములు క్షమించి – జీవమును మాకిచ్చి పరమును ఒసగితివే మమ్మెంతో ప్రేమించి మా కొరకు నిలచితివే