యేసు నీకే జయం జయము
Yaesu Neekae Jaym Jayamu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 12/29/2021
Lyrics
యేసు నీకే జయం జయము నీవే లోక పాలకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక రక్షకుడవు జై జై అనుచు నీకే పాడెదం జన్మించె జగమున మానవ రూపములో ప్రాయశ్చిత్తముకై తానే బలియాయె పాపియైన మాన-వుని రక్షింప సిలువ నెక్కి తన ప్రాణము నిచ్చెన్ హల్లెలూయా భువిపైన మరణము ద్వారా – అంతమాయె బలులు తన సమాధి సర్వం కప్పెన్ తిరిగి లేచుటచే సర్వం నూతనమాయె సంపూర్ణముగ ఓడిపోయె మృత్యు సమాధి హల్లెలూయా భువిపైన స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతమొందెన్ తండ్రి కుడిప్రక్కన ఆయన కూర్చుండెన్ రాజుల రాజై ప్రభువుల ప్రభువై పొందె అధికారము – పరలోకముపై హల్లెలూయా భువిపైన తన రూపమునకు మార్పు నిష్ట-మాయె సృష్టికంటె ముందు తానే సంకల్పించె లోక దుఃఖము నుండి – మనం తప్పించుకొని తన రూపము నొంది – తనతో నుండెదం హల్లెలూయా భువిపైన