యేసు పరిశుద్ధ నామమునకు

Yaesu Parishuddha Naamamunaku

UncategorizedAdded on 9/29/2016

Lyrics

యేసు పరిశుద్ధ నామమునకు
ఎప్పుడు అధిక స్తోత్రము
ఇహపరమున మేలైన నామము
శక్తి గల్గినట్టి నామమిది
పరిశుద్దులు స్తుతించు నామమిది
సైతానున్‌ పాతాళమును జయించు
వీరత్వము గల నామమిది
జయమొందెదము ఈ నామమున
నశించు పాపుల రక్షించు లోక
మున కేతెంచిన నామమిది
పరలోకమున చేర్చు నామమిది
ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు
ఉన్నత దేవుని నామమిది
లోకమంతా ప్రకాశించే నామమిది
శోధన, బాధల, కష్ట సమయాన
ఓదార్చి నడుపు నామమిది
ఆటంకము తొలగించు నామమిది

Video