యేసు రాజ్యమునకు సైనికులం

Yaesu Raajyamunaku Sainikulm

Lyricistసాయారం గట్టు
UncategorizedAdded on 5/15/2017

Lyrics

యేసు రాజ్యమునకు సైనికులం
పరమునకు మనమే వారసులం
ప్రేమ పంచిన దేవుని శిష్యులం
ఎదురు బెదురూ ఎరుగని వారలం
కారు చీకటి కమ్మిన లోకము
కాదు మన ప్రభువుకు సమ్మతము
ఆత్మలు నశియించుట ఘోరము
వారి రక్షణయే మన భారము
వెలుగే మనమని సెలవిచ్ఛేనని
అప్పగించిన పని జరిగింతుము
(2)      ||ప్రేమ పంచిన||
వలదు నీ మదిలో సందేహము
ప్రభువే పెంచునుగా నీ జ్ఞానము
తగిన రీతి తలాంతులు నొసగును
నిన్ను అద్భుత పాత్రగా మలచును
నీకు భారము మదిలో మెదిలితే
ప్రభువే మార్గము చేయును సరళము
(2)      ||ప్రేమ పంచిన||
నీవు పొందిన సువార్త ఫలము
ఇతరులకు పంచుటయే ఘనము
సాక్ష్యమును చాటించే ధైర్యము
లోకమునకు చూపించును నిజము
కోత ఎంతగ ఉంది విరివిగా
కోయుదాము ప్రభు పనివారుగా
(2)      ||ప్రేమ పంచిన||