యేసు రక్తమే జయము
Yaesu Rakthamae Jayamu
UncategorizedAdded on 11/3/2018
Lyrics
యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపు నీదేరా బలహీనులకు బలమైన దుర్గము – ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును – స్వస్థత యేసు రక్తము శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం మృత్యువునే గెలుచు రక్తము పాతాలం మూయు రక్తము నరకాన్ని బంధించిన జయశీలి అధిపతి రారాజు యేసయ్యే ||యేసు|| పాపికి శరణం యేసు రక్తము – రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారద్రోలును – ఖడ్గము యేసు రక్తము శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు? ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు సాతాన్నే నలగ్గొట్టిన వాడి తలనే చితగ్గొట్టిన కొదమ సింహమై మేఘారూఢిగా తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే ||యేసు||