యేసు రక్తములో

Yaesu Rakthamulo

Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 10/21/2015

Lyrics

యేసు రక్తములో నాకు జయమే జయము
ప్రభు యేసు రక్తములో నిత్యం విజయం
జయం జయం జయం జయం – నా యేసునిలో
జయం జయం జయం జయం – ప్రభుయేసు రక్తములో
(2)     ||యేసు రక్తములో||
పాపాలను క్షమియించి – శాపాలను భరియించి
విడుదలను కలిగించే యేసు రక్తము
మరణాన్ని తొలగించి – నరకాన్ని తప్పించి
పరలోకానికి చేర్చే యేసు రక్తము
అమూల్యమైనది పవిత్రమైనది
ప్రశస్తమైనది నిష్కళంకమైనది
(2)      ||జయం జయం||
శోధనలలో జయమిచ్చి – బాధలో నెమ్మదినిచ్చి
ఆదరణను కలిగించే యేసు రక్తము
రోగాలను లయపరచి – వ్యాధులను దూరం చేసి
స్వస్థత నాకు చేకూర్చే యేసు రక్తము
అమూల్యమైనది పవిత్రమైనది
ప్రశస్తమైనది నిష్కళంకమైనది
(2)      ||జయం జయం||

Video