యేసుతో ఠీవిగాను పోదమా
Yaesutho Theevigaanu Podamaa
UncategorizedAdded on 11/5/2013
Lyrics
యేసుతో ఠీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోదము ||యేసుతో|| రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| ఓ యువతి యువకులారా చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంత ఏకమై యేసునాథు గొల్వను సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో||