యవ్వనుడా
Yavvanudaa
Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 9/11/2015
Lyrics
యవ్వనుడా యవ్వనుడా మాటిమాటికి ఏల పడిపోవుచున్నావు? యవ్వనుడా యవ్వనుడా నీ పాపజీవితంలో ఇంక ఎన్నాళ్ళు సాగెదవు? ||యవ్వనుడా|| దుష్టుడు శోధనలకు గురిచేయుచుండగా వాక్యమనే ఖడ్గముతో తరిమికొట్టుము యేసయ్యను స్వీకరించి వెంబడించుము అపజయమే ఎరుగక సాగిపోవుము ||యవ్వనుడా|| అనుదినము వాక్యముతో సరిచేసుకొనుము ఇతరులకొక మాదిరిగా జీవించుము పాపమనే చీకటిలో ఉన్నవారిని నీ సాక్ష్యముతో వెలుగులోకి నడిపించుము ||యవ్వనుడా|| యవ్వనుడా యవ్వనుడా ఇప్పటికైనా… యేసు పాదాల చెంతకి రావా