యవ్వనులారా మీరు

Yavvanulaaraa Meeru

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 7/18/2018

Lyrics

యవ్వనులారా మీరు – ప్రభు నొద్దకు రండి
సమృద్ధియైన జీవము నొందుటకు –
ఆహాహా హల్లెలూయా –
ప్రభు యేసు మన కొరకు
సిలువపై బలియాయెను
మీ పాపమునొప్పుకొనిన
క్షమియించి నూతన జీవమునిచ్చున్
ప్రభు యేసుని స్వరమును వినుచు
ఆ ప్రభుని వెంబడించిన
కాపాడును దుష్టుని నుండి
నడిపించు నిన్ను అంతము వరకు
చేపట్టి జీవ వాక్యము
జ్యోతుల వలె ఇహమందున
ప్రభు కొరకు ప్రకాశించుచు
ప్రకటింతురు ప్రభు యేసుని సువార్తను
నిజ ఆహారా పానీయం
ప్రభు యేసు క్రీస్తే కాగా
ఆయననే తిని త్రాగుచూ
ఆ జీవముతో మనము జీవించెదము
మృతి నొందిన మనమందరము
పై వాటినే వెంటాడెదం
మన జీవము వృద్ధి నొందుచూ
ప్రభు యేసుని మహిమను పొందెదము
(2)        ||యవ్వనులారా||

Video