యెహోవ నా ఆశ్రయం

Yehova Naa Aashraym

UncategorizedAdded on 4/26/2016

Lyrics

డేవిడ్ ఎడిసన్ తేళ్ల
యెహోవ నా ఆశ్రయం
నా విమోచన దుర్గము
నా ధ్యానం నా గానం
యెహోవ నా అతిశయం
(2)      ||యెహోవ||
తన ఆలయాన నా మోర వినెను
భూమి కంపించేలా ఘర్జన చేసెను
మేఘాలు వంచి ఎగిరి వచ్చి
జలరాసులనుండి నన్ను లేపెను
ఆయనకు ఇష్టుడను – అందుకే నన్ను తప్పించెను
ఆయనలో నా స్వాస్థ్యము – ఎంత మహిమోన్నతమైనది
ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది
హల్లెలూయ హల్లెలూయ హోసన్నా
(4)     ||యెహోవ||
నా చేతి వేళ్ళకు సమరము నేర్పెను
నా గుండెకు శౌర్యము నేర్పెను
జయము నాకు జన్మ హక్కు
ఆత్మాభిషేకము నా అగ్ని స్వరము
శత్రువుల గుండెలలో – యేసు రక్తము సింహ స్వప్నము
ఏ యుద్ధ భూమైనాను – యేసు నామం సింహనాదం
ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది
హల్లెలూయ హల్లెలూయ హోసన్నా
(4)       ||యెహోవ||

Video