యెహోవ నా మొర లాలించెను

Yehova Naa Mora Laalimchenu

Lyricistపురుషోత్తము చౌదరి
UncategorizedAdded on 11/5/2013

Lyrics

యెహోవ నా మొర లాలించెను
దన మహా దయను నను గనించెను
అహర్నిశల దీనహీనుడగు నా
దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను
||యెహోవ||
పిశాచి గడిమి బడగొట్టెను
దన వశాన నను నిలువ బెట్టెను
ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల
నిశాంతమున జే ర్చి సేద దీర్చెను
||యెహోవ||
మదావలము బోలు నా మదిన్
దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్
యధేచ్చలన్నిటి గుదించి పాపపు
మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను
||యెహోవ||
అనీతి వస్త్ర మెడలించెను
యే సునాథు రక్తమున ముంచెను
వినూత్న యత్నమే ద నూని యెన్నడు
గనన్ వినన్ బ్రే మ నాకు జూపెను
||యెహోవ||
విలాపములకు జెవి నిచ్చెను
శ్రమ కలాపములకు సెలవిచ్చెను
శిలానగము పై కిలాగి నను సుఖ
కళావళుల్ మన సులోన నిలిపెను
||యెహోవ||
అగణ్య పాపియని త్రోయక
న న్ను గూర్చి తన సుతుని దా చక
తెగించి మృతి కొ ప్పగించి పాపపు
నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను
||యెహోవ||

Video