యెహోవా మా కాపరి
Yehovaa Maa Kaapari
UncategorizedAdded on 7/21/2016
Lyrics
యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి మాకు లేనిది లేదు లేమి కలుగదు (2) ||యెహోవా|| వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను ఆత్మ జలములో దప్పిక తీర్చెను మా ప్రాణములు సేదదీర్చేను నీతి మార్గమున నడిపించెను ||యెహోవా|| కారు చీకటిలో కన్నీరు తుడిచెను మరణ పడకలో ఊపిరి పోసెను మా తోడు నీడై నిలిచి నడచెను శత్రు పీఠమున విందు చేసెను ||యెహోవా|| పరిశుద్ధాత్మలో ముంచి వేసెను పరమానందము పొంగిపోయెను పరలోకములో గొరియపిల్లను నిరతము మేము కీర్తింతుము ||యెహోవా||