యెహోవా నా బలమా

Yehovaa Naa Balamaa

Lyricistజాన్ గొల్లపల్లి
UncategorizedAdded on 11/5/2013

Lyrics

యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం
||యెహోవా||
నా శత్రువులు నను చుట్టిననూ
నరకపు పాశములరికట్టిననూ
వరదవలె భక్తిహీనులు పొర్లిన
విడువక నను ఎడబాయని దేవా
||యెహోవా||
మరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నతదుర్గమై రక్షనశృంగమై
తన ఆలయములో నా మొఱ్ఱ వినెను
ఆదరెను ధరణి భయకంపముచే
||యెహోవా||
నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా చేయును
జలరాసులనుండి బలమైన చేతితో
వెలుపల చేర్చిన బలమైన దేవుడు
||యెహోవా||
పౌరుషముగల ప్రభు కొపింపగా
పర్వతముల పునాదులు వణకెను
తన నోటనుండి వచ్చిన అగ్ని
దహించివేసెను వైరులనెల్లన్
||యెహోవా||
మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును
ఉరుముల మెరుపుల మెండుగ జేసి
అపజయమిచ్చును అపవాదికిని
||యెహోవా||
దయగలవారిపై దయ చూపించును
కఠినులయెడల వికటము జూపును
గర్విష్టుల యొక్క గర్వమునణుచును
సర్వమునెరిగిన సర్వాధికారి
||యెహోవా||
నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి
రక్షణ కేడెము నాకందించి
అక్షయముగ తన పక్షము జేర్చిన
||యెహోవా||
యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ నీవే
అన్యజనులలో ధన్యత చూపుచు
హల్లెలూయ స్తుతిగానము చేసెద
||యెహోవా||

Video