యెహోవా నా కాపరి
Yehovaa Naa Kaapari
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 7/10/2015
Lyrics
యెహోవా నా కాపరి నాకు లేమిలేదు పచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్ || యెహోవా || మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్ || యెహోవా || పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు ప్రభు సిద్ధము చేయున్ పరవశమెందెదను || యెహోవా || నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లుచున్నది || యెహోవా || చిరకాలము నేను ప్రభు మందిరములో వసియించెద నిరతం సంతసమొందెదను || యెహోవా ||