యెహోవా నాకు వెలుగాయె

Yehovaa Naaku Velugaaye

UncategorizedAdded on 2/17/2018

Lyrics

యెహోవా నాకు వెలుగాయె
యెహోవా నాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమయ్యె
నేను ఎవరికీ ఎన్నడు భయపడను –
నాకు మార్గమును ఉపదేశమును
ఆలోచన అనుగ్రహించే
తన ఆజ్ఞలలో జీవించుటకై
కృపతో నింపి కాపాడుము
(2)        ||యెహోవా||
నా కొండయు నా కోటయు
నా ఆశ్రయము నీవే
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో
స్తుతి గానము చేసెదను
(2)        ||యెహోవా||
నా తల్లియు నా తండ్రియు
ఒకవేళ విడచినను
ఆపత్కాలములో చేయి విడువకను
యెహోవా నన్ను చేరదీయును
(2)        ||యెహోవా||

Video